27.3 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థుల ఉన్నత విద్యకు తొలి అడుగు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 50 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలు

 

. . . రికార్డులు అందజేసిన ఉపాధ్యాయులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యలోకి అడుగుపెట్టే కార్యక్రమం నిర్వహించారు. గురువారం 50 మంది విద్యార్థిని విద్యార్థులను ఆరో తరగతిలో నమోదు చేశారు. కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా రికార్డు సీట్లు, బోనఫైడ్లు, విద్యార్థుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్నకు అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఐదవ తరగతిలో మొత్తం 60 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వారిలో కొంతమంది విద్యార్థులు ఇతర పాఠశాలల్లో, మరికొందరు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరుతున్నారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌కు పునాది వేసే దిశగా పాఠశాలల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

More articles

Latest article