బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను సంవత్సరం గడుస్తున్న అమలు చేయకపోవడం ఘోరమని ఇట్టి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బీజేపీ కార్యకర్తలు ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణం లో బీజేపీ పార్టీ నిర్వహించిన ఏడాది ప్రభుత్వ పాలన వైఫల్యం పై నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరై 6 గ్యారంటీలు, 66 అబద్దాలు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు విషయం ఇంటింటికి బీజేపీ కార్యకర్తలు వెళ్లి వివరించాలన్నారు.ఒకటి, రెండు హామీలు అమలు చేసి అన్ని చేసామని అబద్దాలు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ అయినవారు తక్కువ కానివారు ఎక్కవ అని, రైతు భరోసా అడ్రస్సే లేదని, మహిళలకు ఇస్తానన్న రూ. 2000 భృతి ఎక్కడ పోయిందని, రూ. 4000 కు పెంచి ఇస్తానన్న పెన్షన్లు ఏమయ్యాయాయని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర నర్సయ్య, మెండోరా మాజీ ఎంపిటిసీ అరే రవీందర్,మండల పార్టీ ప్రెసిడెంట్ మునిగే మహిపాల్, కానిస్టెన్సీ యువ మోర్చా నాయకులు కనికరం మధు,సీనియర్ నాయకులు సంధ్య రాజు, రైతు నాయకులు గంగాధర్, గంగాధర్ గౌడ్,బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

