. . . డా పి.రామ్ మోహన్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలోని అన్ని భాషలు నేర్చుకోవాలని, అయితే మాతృభాషను మర్చిపోరాదని, భాషలతోనే ఆయా జాతుల అస్తిత్వం ముడిపడి ఉంటుందని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డా పి. రామ్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శనివారం కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -2026 ఘనంగా నిర్వహించారు. తెలుగు విభాగధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి మాట్లాడుతూ మాతృభాషల అభ్యసనం ద్వారానే సృజనాత్మకత, ఆలోచనలు, విలువలు అలవాటు అవుతాయని, సంస్కృతి సంప్రదాయాలను నిలిపేవి భాషలే అని అన్నారు. ఒక మాతృభాషను నేర్చుకున్న వారు అనేక భాషలు నేర్చుకోవడం సులభమని, అవసరమని ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ దండు స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో అకడామిక్ కోఆర్డినేటర్ నహీదా బేగం, హిందీ విభాగాధిపతి రాహుల్, అధ్యాపకులు సుభాషిణి దేవి, గంగాధర్, రాధిక, అర్చన, అస్రా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

