భాషలతోనే ఆయా జాతుల అస్తిత్వం ముడిపడి ఉంది
. . . డా పి.రామ్ మోహన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలోని అన్ని భాషలు నేర్చుకోవాలని, అయితే మాతృభాషను మర్చిపోరాదని, భాషలతోనే ఆయా జాతుల అస్తిత్వం ముడిపడి ఉంటుందని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డా పి. రామ్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శనివారం కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -2026 ఘనంగా నిర్వహించారు. తెలుగు విభాగధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి మాట్లాడుతూ...