. . . కాలువ పక్కన మొరం డంపులు
. . . పట్టించుకోని ఇరిగేషన్ శాఖ అధికారులు
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :
నిజాం సాగర్ కాలువలు కబ్జాకు గురి అవుతున్నప్పటికీ ఆశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. వర్ని మండల కేంద్రంలో ప్రధాన కాలువ కబ్జాకు గురి అవుతున్నప్పటికి అధికారులు మాముళ్లు తీసుకోని వదిలి వేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సాగు నీటి కాలువలను ఆక్రమిoచుకుంటే కఠినంగా వ్యవహరించ వలిసిన ఆశాఖ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటయ్య క్యాంపు వద్ద ప్రధాన కాలువ పై పక్కా భవనాల నిర్మాణాలకు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులోచ్చినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదు. నిజాంసాగర్ కాలువలు ఆక్రమించుకొని నిర్మాణాలు చెప్పట్టడం ద్వారా సాగు నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కోటయ్య క్యాంపు వద్ద నిజాంసాగర్ కు చెందిన విలువైన భూమి కబ్జా చేస్తున్నారు. ప్రధాన కాలువ స్థలాలను ఆక్రమించుకుంటున్నప్పటికీ పట్టిoచుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. ప్రధాన కాలువ రెండు కిలోమీటర్లు పొడవున క్రమ క్రమంగా ఆక్రమణలు జరుగుతున్నా పట్టించు కోవడం లేదని తెలుస్తుంది.
