25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుంద బల్దియాలో మొదలైన ఎన్నికల వేడి

Must read

📰 Generate e-Paper Clip

. . . కౌన్సిలర్ పదవుల కోసమే ఆశవాహుల ప్రయత్నాలు

 

. . . పార్టీ జెండాలు మోయని వారు సైతం బరిలో నిలిచేందుకు ఆసక్తి

 

. . . ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ సేవలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి

 

. . . ఎవరి ధీమా వారిదే.. ఆశవాహుల్లో నెలకొన్న ఉత్కంఠ

 

బిచ్కుంద. బతుకమ్మ:

 

ఎన్నికలు వస్తే చాలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఆశావాహులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. పార్టీ జెండాలు మోసింది లేదు, ప్రజాసేవ చేసింది లేదు పదవులు మాత్రం వారికి కావాలి. బిచ్కుంద పట్టణంలో బల్దియా ఎన్నికల వేడి మొదలు కావడంతో బరిలో నేనంటే నేను ఉన్నానంటూ పలువురు ఆశావాహులు ఆయా పార్టీల నుంచి అధిష్టానం మెప్పుకోసం నానా తంటలు పడుతున్నారు. ఇటీవల ఏ సమావేశం నిర్వహించిన ముందుంటూ ఫోటోలకు ఫోజులు కొడుతూ బిచ్కుంద లో ఓ చోట లీడర్ హల్చల్ చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు అందించామని పార్టీ జెండాలు మోస్తున్నామని చెబుతుండడం గమనార్హం. కాగా అసలైన జెండా మోసిన కార్యకర్తలకు వీరి వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయని పార్టీ అధిష్టానం సైతం ‘బి’ ఫామ్ ఇచ్చేముందు అన్ని రకాలుగా ఆలోచించి ఎవరేంటో తెలుసుకొని ముందడుగు వేసేలా కృషి చేయాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

బిచ్కుంద బల్దియా బాద్ షా ఎవరో…

బిచ్కుంద మున్సిపల్ బాద్షా ఎవరో అని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీలతో పాటు ఆశావాహులు బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో బల్దియా పీఠం ఎవరికి దక్కుతుందో అని సందిగ్ధం నెలకొంది. కాగా ఆయా పార్టీల నుంచి మేమంటే మేము బరిలో ఉన్నామంటూ పోటీ తీవ్రతరం కానుంది.

వార్డుల్లో ఆశవాహులు అధికం..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్ బరిలో నిలిచేందుకు ఆయా వార్డుల నుంచి చోటా మోట నాయకులు నేనంటే నేనంటూ బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆయా పార్టీల నుంచి అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలియడం లేదు. కాగా కొందరు గతంలో సర్పంచ్ ఎలక్షన్ల అప్పుడు పెద్దలు చెబితే విన్నామని నామినేషన్లు వేసిన కూడా ఉపసంహరించుకున్నామని ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు చోటా మోట నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని బీఫామ్ టికెట్లు ఎవరికి దక్కెనో బరిలో ఎవరు నిలిచెనో, మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

ఎప్పుడు కనిపించని కొత్త ముఖాలు తెరపైకి..

మున్సిపల్ ఎన్నికలు రావడంతో గతంలో ఎప్పుడూ చూడని ముఖాలతో పాటు,అప్పుడప్పుడు అమావాస్య పున్నమికి వచ్చే నాయకులు సైతం కౌన్సిలర్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడం పట్ల సర్వత్రా పలువురు నిజమైన నాయకులు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరెన్ని వింతలు విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని, నిజమైన అర్హత కలిగి ప్రజలకు అందుబాటులో ఉండి బరిలో నిలిచేది ఎవరో ఏంటో పూర్తిస్థాయిలో తెలుసుకొని,  రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సరైన విధంగా సద్వినియోగం చేసుకునే అవకాశం చేజార్చుకోవద్దని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లపాటు అభివృద్ధి జరగాలంటే, మన ఓటు సద్వినియోగం కావాలంటే, సరైన వ్యక్తి ఎవరో, పైపై మాయ మాటలు చెప్పి తప్పించుకునేది ఎవరో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article