28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎడపల్లి ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

ఎడపల్లి ఎంఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జస్ట్‌ మెంట్, డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారంలో పనిచేస్తున్న కే. నిర్మల (ఎస్‌ఏ హిందీ)ను ఎంఈఓ ప్రొసీడింగ్స్ ఆర్‌సీ నెం. ఈ1/166/2026 ప్రకారం జులై 2 న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏఆర్‌పీ క్యాంపుకు వర్క్ అడ్జస్ట్‌ మెంట్ పేరుతో పంపించారు. అయితే సర్‌ప్లస్ కారణంగా హిందీ ఉపాధ్యాయురాలిని ఏఆర్‌పీ క్యాంపుకు పంపిన తర్వాత, అదే పాఠశాలలో పనిచేస్తున్న కే. శివానంద్‌ను తిరిగి ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారంకు డిప్యూటేషన్‌పై నియమించడం విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య పూర్తిగా కక్షపూరితంగా జరిగిందని ఆరోపించిన పీఆర్‌టీయూ తెలంగాణ, కే. నిర్మలను వెంటనే ఏఆర్‌పీ క్యాంపు నుంచి తిరిగి ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారంకు పంపించాలని డిమాండ్ చేసింది. అలాగే, నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన ఎడపల్లి ఎంఈఓపై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టి, అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి కోరారు.

More articles

Latest article