ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండలం ఎర్రమన్నుకుచ్చ కు చెందిన యువతి అదృశ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రమన్నుకుచ్చ కు చెందిన కల్లెం పాలవ్వ, ఎల్లయ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు సంతానం. వీరు గత సంవత్సరం నుండి సోమర్పేట్ రోడ్‌లోని డబుల్ బెడ్ రూమ్ నందు నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఎర్రమన్ను కుచ్చ లో గల తమ కులదైవం లహరి కృష్ణ దేవాలయానికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్లారు. ఆలయం వద్ద నుండి వారి పెద్ద కుమార్తె కల్లెం పరిమళ (19) బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినా ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ నేపథ్యంలో యువతి తల్లి కల్లెం పాలవ్వ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ గురించి సమాచారం ఉన్న వారు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కి, లేదా 8712686160 నెంబర్ కి తెలపాలని పోలీసులు కోరారు.
