26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యావవస్థ అభివృద్ధి సీఎం మాటల్లో తప్ప చేతల్లో లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యావ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయడం అనేది ముఖ్యమంత్రి మాటల్లో తప్ప ఆచరణలో లేదని, విద్యార్ధులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించింది కేవలం 26,674 కోట్లే అని తెలిపారు. 2026-27 ఆర్ధిక సంఘం కేటాయింపులలో విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు 8.22% మాత్రమే అని, 2025-26 ఆర్ధిక సంఘంలో 7.6% కేటాయించారని, ఈ రెండు బడ్జెట్లలో వ్యత్యాసం కేవలం 0.6% మాత్రమే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు కేటాయించిన కేటాయింపుల్లో 80% పై గా కేవలం జీతాలకే సరిపోతుందని, మీరు అంటున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, విద్యామిషన్ నివేదిక అంటున్న తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఇబ్బడి ముబ్బడిగా విద్యార్ధుల స్కాలర్ షిప్ లే పెండింగ్ లో ఉన్న ఈ పరిస్థితి లో విద్యార్ధులు సర్టిఫికెట్ లు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు మౌలిక సదుపాయాలు లేక ప్రాథమిక పాఠశాలలు నుండి యూనివర్సిటీల వరకు విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో బడ్జెట్లో విద్యకు నామమాత్ర కేటాయింపులు చేయడం బాధాకరమని, ఈ బడ్జెట్ ను ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర, జాతీయ కమిటీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

More articles

Latest article