- నేడు కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం
- స్థానిక సంస్థల ఎన్నికల ’యుద్దానికి’ బీఆర్ఎస్ సిద్ధం
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నాటి ’దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం. నేడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో శని వారం పెద్ద ఎత్తున నిర్వహించిన ‘దీక్షాదివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ది ఎప్పటికీ చేరిపేయలేని సంతక మన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన ‘ దీక్షా దివస్ ‘ చరిత్రలో చెరిగిపోని సంతకం. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్.తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది.ఇది స్వరాష్ట్ర కల సాకారానికి పునాది పడిన రోజు. కేసీఆర్ దీక్ష సూర్య చంద్రులున్నంత వరకూ నిలిచిపోయే శుభదినం . కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను,36 పార్టీలను ఒప్పించి, మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమ నేత కేసీఆర్. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చెట్టు తల్లి వేరు లాంటివారని ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదని, వటావృక్షమని స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఏదో పీకుతామని శపధాలు చేసిన వైఎస్ , చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి జెండాలు పీక్కోని పోయారు. తెలంగాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేమన్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది. చిట్టినాయుడి అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు.కేసీఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ. నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణ. అబద్దాల హామీలిచ్చి కాంగ్రెస్ కు ఓట్లెయాలని దండంపెట్టి నేడుvఅమలు చేయలేక ఆ హామీలకు పిండం పెడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు వెలుగులు పోయి మళ్లీ చీకట్ల తెలంగాణ వచ్చింది. రైతు బంధుకు రాం రాం పలికిండు. రెండు లక్షల రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ పెట్టిండు.పెన్షన్లు మాయం స్హెది అవ్వాతాతలకు గాయం చేసిండు.కొడంగల్ ప్రజలే రేవంత్ రెడ్డి పై తిరగబడుతుండ్రు. గురుకులాల్లో పురుగులభోజనం. విద్యార్ధులకుస్కాలర్ షిప్పులు గోవిందా. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల గగ్గోలు. ఉద్యమ బాటలోఆశాలు, అంగన్ వాడీలు , ప్రభుత్వ ఉద్యోగులు. నిధుల కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టిండ్రు. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు రణభేరి మోగిస్తున్నారు. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితుల హాహాకారాలు చేస్తున్నారు. మూసీ పరివాహక నివాసితుల శాపనార్థాలు పెడుతుండ్రు. చివరకు పోలీసులు కూడా రోడ్ల పాలయ్యారు. కల్యాణ లక్ష్మీకి కాలదోషం పట్టింది. తులం బంగారం ఊసేలేదు. మహాలక్ష్మి పథకం అటకెక్కింది. నిరుద్యోగ భృతి నిల్. ఇలా నువ్వు మోసం చేయని ప్రజలెవరయినా ఉన్నారా?.రేవంత్ రెడ్డి ను తిట్టని వారెవరైనా ఉన్నారా?. నమ్మి ఓటేసినందుకు అందరినీ నట్టేట ముంచినవు. బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ. రేవంత్ ది చీటర్స్ ఫ్యామిలీ. కాంగ్రెస్ ది అవినీతి ఫ్యామిలీ. సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడ్డరుఖాన్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ సీఎం కాదు కదా చెప్రాసీ కూడా అయివుండేవాడు కాదన్నారు. ఇక్కడి బుడ్డరు ఖాన్ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కాలేడు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యేవారా?. అల్జీమర్ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కాగలరా?.బీఆర్ఎస్ ది 60లక్షల సైన్యం. మా కార్యకర్తలు వ్యక్తులు కాదు మహాశక్తులు. కేసీఆర్ 500కే వీ ట్రాన్స్ ఫార్మర్ అయితే మా కార్యకర్తలు 3-పేజ్ కరెంటు. ముట్టుకుంటే మాడి మసై పోతారు . ఏడాదిలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత పెల్లు బికిందన్నారు.మళ్లీ వచ్చేది కేసీఆరేనంటూ ఎక్కడికక్కడ అన్నివర్గాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా గులాబీ గడ్డ కేసీఆర్ అడ్డా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,ఆయేషా ఫాతీమా,మాజీ మేయర్ నీతుకిరణ్, ఉద్యమకారులు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

