25.4 C
Hyderabad

ఉచిత కుట్టుమిషన్ల దరఖాస్తుల గడువును పొడగించాలి

The deadline for applications for free sewing machines should be extended.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  బీసీ వెల్పేర్ అధికారి సాయికుమార్ కు వినతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ మహిళలకు ఉచిత వెయ్యి కుట్టుమిషన్ల పంపిణీ దరఖాస్తులకు గడవు పొడగించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొట్టూర్ చంద్రకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం బీసీ వేల్పేర్ అధికారి సాయికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొట్టూర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదిలోగా ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని కానీ 12 రెండవ శనివారం, 13 ఆదివారం, 14  వినాయకచవితి వరుస సెలవులు వస్తున్నయన్నారు. కుల, ఆధాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారివి ఎమ్మార్వో కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయని  దీంతో దరఖాస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  మరికొంత సమయం పొడగిస్తే కుల, ఆదాయ సర్టిఫికెట్ల దరఖాస్తులు చేసుకున్నా వారు సైతం ఉచిత కుట్టుమిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందన్నారు. కావున ఈ విషయాన్ని ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

 

More articles

Latest article