బతుకమ్మ భిక్కనూరు: తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ గా నియమించబడ్డ ప్రొఫెసర్ యాదగిరి రావును కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో గురువారం ఘనంగా సన్మానించారు. వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, హాస్టల్ వార్డెన్ డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, ఉమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, నిరంజన్, దిలీప్ పాల్గొన్నారు.
