27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫ్లెక్సీల కలకలం..

Must read

📰 Generate e-Paper Clip

 కోటగిరి, బతుకమ్మ :  తమకు రావాల్సిన డబుల్ బెడ్ రూం బిల్లు రూ. నాలుగు లక్షల రూపాయలను మాజీ సర్పంచ్ తన స్వార్థం కోసం వాడుకున్నాడని  ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటన  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామనికి చెందిన మసుగొండ సతీష్ అనే లబ్ధిదారుకి రావాల్సిన డబల్ బెడ్ రూమ్  బిల్లు రూ. నాలుగు లక్షల రూపాయలను  తాజా మాజీ సర్పంచ్ సిరిగిరి సాయిబాబు తమ స్వార్థం కోసం వాడుకొని అక్రమాలకు వసూళ్లకు  పాల్పడ్డాడని ఆరోపించారు. వెంటనే అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని  మసుగొండ సతీష్ అనే పేరు మీద  సోమవారం రాత్రి  ఎత్తోండ  గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు  చేశారు. దీంతో  గ్రామంలో ఈఫ్లె క్సీ కల కలం సృష్టించింది.

More articles

Latest article