26.3 C
Hyderabad

అర్చకుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ధూప దీప నైవేద్య అర్చకులకు సంక్షేమ పథకాలను, నిధులు మంజూరు చేసినందుకు  అర్చకులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పాత వర్నిలో గల శంభుని దేవాలయం వద్ద వర్ని, రుద్రూర్, చందూర్, మోస్త్రా కోటగిరి మండలాల అర్చకులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖ చిత్రపటాలకు వేదమంత్రార్చనలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. అర్చకులకు సంక్షేమ పథకాలు, నిధులు మంజూరు చేసి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అర్చకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి చిన్న బసప్ప, ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివస్వామి, ఆరు మండలాల అధ్యక్షులు భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్, పరమేశ్వర్, శంకరప్ప, టి.సంతోష్, గిరి, ప్రేమ్ దాస్, రతన్, మహేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article