23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

నామమాత్రంగా క్లూస్ టీం ఆధారాల సేకరణ..!

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులను సైతం అనుమతించని క్లూస్ టీం

 

. . . మీడియాను సంఘటన స్థలానికి రావద్దని వారించిన కానిస్టేబుల్ రఘు

 

. . . అంతర్మథనం ఏమిటో.?

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గుర్తు తెలియని దొంగల బీభత్సంలో భాగంగా ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి సత్తవ్వ ఇంటిలో తాళం వేసిన ఇంటిలో తాళాన్ని పగుల గొట్టి దొంగతనాన్ని చేయడంతో ఇంటి యజమానురాలు కమ్మరి సత్తవ్వ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం క్లూస్ టీం బాధితురాలి ఇంటికి వచ్చి ఇంటి కుటుంబ సభ్యులను అనుమతించకుండా, మీడియాను సైతం రావద్దని కానిస్టేబుల్ రఘు వారించడంతో లోలోపల నామమేత్రంగా సోదా తనిఖీలు నిర్వహించారు. దీంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోలోపల ఆధారాలు సేకరణ చేయడం పట్ల మతలాబు ఏంటని చర్చించుకుంటున్నారు.

More articles

Latest article