24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అమరవీరుల స్పూర్తి వారోత్సవాల ముగింపు సభ ను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మేడే” అమరవీరుల స్పూర్తి వారోత్సవాల ముగింపు సభ మే 10 న ఉదయం 11 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో జరగనుందని బీఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గ హక్కులు, సామాజిక న్యాయం, కార్మిక ఉద్యమాల చరిత్ర, మేడే అమరవీరుల త్యాగస్ఫూర్తి వంటి అంశాలపై వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1 నుండి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మేడే” వారోత్సవాలను నిర్వహిస్తున్న బిఎల్ టియు, కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ ముగింపు సభకు కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు కవరేజ్ చేయాలని బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ విజ్ఞప్తి చేశారు. “జై భీమ్ – లాల్ సలాం” నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

More articles

Latest article