- జాతీయ మాల ఐక్యవేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
కామారెడ్డి సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు వికాస్ పథకంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో సివిల్ స్కోర్ నిబంధనలు ప్రవేశ పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మాల ఐక్యవేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాల గురువారం తెలిపారు. సిబిల్ స్కోర్ నిబంధనను వెంటనే తోలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు.