26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యూనివర్సిటి బాలుర ఆవసతి గృహాలను తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర ఆవసతి గృహాలను చీఫ్ వార్డెన్ డాక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డెన్ లు డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్ లు తనిఖీ చేశారు.

The Chief Warden inspected the University Boys' Hostels

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు ,రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి ల ఆదేశాల మేరకురెండు వసతిగృహంలోని విద్యార్థులను మెస్ కమిటీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రధానమైన సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హమీ ఇవ్వడం జరిగింది.చీఫ్ వార్డెన్ మహేందర్ రెడ్డి హాస్టల్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుచు సమయపాలనతో పాటు హాస్టల్లో శుభ్రంగా ఉంచాలని నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ బాలుర వసతి గృహాల సంబంధించిన మైస్ కమిటీ సభ్యులు కేర్ టేకర్స్ ,హాస్టల్ సిబ్బంది మిగిలిన విద్యార్థులు పాల్గొన్నారు.

The Chief Warden inspected the University Boys' Hostels

More articles

Latest article