29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్మికులు తమ హక్కులను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, అది జరగకుండా పోరాడాలని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. శుక్రవారం మేడే ని పురస్కరించుకుని నగరంలో సిపిఎం, సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. ప్రాణాలు త్యాగం చేసి కష్టజీవులందరినీ ఐక్యం చేసి ప్రపంచమంత గుర్తు ఉండే విధంగా పోరాటాన్ని నిర్వహించి ప్రాణాలర్పించి కార్మిక హక్కులను సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు వెన్నుపోటు పొడిచిందన్నారు.

 

The central government is trying to change the constitution.

 

చికాగో పోరాట స్ఫూర్తితో జండాలు ఎగర వేయడం కాకుండా మన బానిసత్వం పోవాలంటే ఉన్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు మనం పడుతున్న కష్టాలు రేపు మన పిల్లలకు రాకుడదన్నా, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందాలన్న ప్రతి ఒక్కటీ పోరాటంతో ముడిపడి ఉందని, కాబట్టి సిపిఎం పార్టీగా ఎలాంటి పోరాటాలకు పిలుపునిచ్చిన ముందుండి విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు అడివాలా అనిత, బొప్పిని అనసూయ, దేరంగుల దీపిక, నలవాల నరసయ్య, సర్ప లింగం, అంజయ్య, శంషు, అహ్మద్, మహబూబ్, రజియా, యశోద, సంగీత తదితరులు పాల్గొన్నారు.

 

The central government is trying to change the constitution.

More articles

Latest article