- బాధిత కుటుంభానికి ప్రభుత్వ ఫరంగా అండగా ఉంటామని హామి
- పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి స్వచ్చందంగా సాయం చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలస జీవనం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గతంలో బయటి దేశాల్లో ఎవరైనా మరణిస్తే ఆ శవం రావడానికే రోజులు, నెలలు పట్టిన దుస్థితిని ఆయన కల్లారా చూసారు. అందుకే ప్రసార సాధనాల్లో ఒమన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆకుల శ్రీకాంత్ గౌడ్ ఆధివారం 19వ తారీఖున మరణించిన వార్తను తెలుసుకుని తక్షణమే స్పందించారు.సీఎం కార్యాలయానికి సమాచారం చేరవేసి ఎంబసీ అధికారులను అప్రమత్తం చేసారు. ఓమన్ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించి కేవలం మూడురోజుల్లోనే మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేలా చొరవ తీసుకున్నారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో గురువారం ఉదయం మూడుగంటలకు శ్రీకాంత్ గౌడ్ భౌతిక కాయం ఒమన్ నుండి స్వస్థలానికి చేరుకుంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించి ప్రభుత్వ ఫరంగా సహాయ సహకారాలు అందించడానికి సంపూర్ణంగా అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా సత్వరమే స్పందించి మానవతను చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు, తెలంగాణ ఎన్నారై సెల్ బాధ్యులు మంద బీంరెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు, మానేరు తెలంగాణ న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ ఒగ్గు బాల్ రాజ్ యాదవ్ కి మృతుని తల్లిదండ్రలు రాజాగౌడ్, లక్ష్మీ దంపతులు కృతజ్ణతలు తెలిపారు.
