తెలంగాణ బీసీల‌కు కేంద్రం లోని బిజేపి ప్ర‌భుత్వమే రిజ‌ర్వేష‌న్ల‌ను దూరం చేస్తోంది

0 4,887

 

. . . బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ నాయ‌కులు మ‌తం రంగు పులమడం బాధాక‌రం

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల

 హైద్రాబాద్, బతుకమ్మ :

తెలంగాణ బీసీల‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజ‌ర్వేష‌న్ల‌ను దూరం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల  అన్నారు. మంగళవారం హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడుతు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయని ఆరొపించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ నాయ‌కులు మ‌తం రంగు పులమడం బాధాక‌రం అని అవేధన వ్యక్తం చేశారు. గుజ‌రాత్ లో ఏ ర‌క‌మైన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారో అంద‌రి తెలుసని అందుకే తెలంగాణ‌లో ఆ పార్టీకి ఓట్లు రావ‌ని తెలిసి బీజేపీ నాయ‌కులు ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు అన్నారు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో 20 శాతానికిపైగా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారు. తెలంగాణ‌తో స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు విష‌యంలో మాత్రం కేంద్రంలోనీ బీజేపీ ప్ర‌భుత్వం సాకులు చెబుతోంది అన్నారు. ఫ్లైట్ మోడ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ల‌డంలో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశారు  కానీ ఢిల్లీలో ప్ర‌ధాని మోదీపై బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవ‌డం లేదు అన్నారు. పార్టీ ప‌రంగా బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీలు పార్టీ ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు కోరుకోవ‌డం లేదు …చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌, రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన రిజ‌ర్వేష‌న్లు కోరుకుంటున్నారు అని కవిత పేర్కోన్నారు. చ‌ట్ట‌బ‌ద్ధంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా ఎన్నిక‌లు నిర్వహించాల‌నుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను బీసీలు వ‌దిలిపెట్ట‌బోరు అని తెలిపారు. త‌క్ష‌ణ‌మే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఆర్డినెన్సును తీసుకురావాలి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

The BJP government at the Center is taking away reservations for the BCs of Telangana.

Leave A Reply

Your email address will not be published.