27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

 రైతాంగ ఉద్యమ యోధుడు శావులం సాయిలు ఆశయాలు సజీవంగానే ఉన్నాయి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ

రైతాంగ, కార్మిక ఉద్యమాలను నిర్మించినప్పుడే శావులం సాయిలుకు నిజమైన నివాళులని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో శావులం సాయిలు 29వ వర్ధంతి సందర్భంగా నగరంలో కోట గల్లి నీలం రామచంద్రయ్య భవన్లో నివాళులర్పించారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ శావులం సాయిలు రైతు కూలీలను ఐక్యం చేసి జీతాగల్ల సమస్యలు, రైతు కూలీరెట్ల  పెంపుకై అనేక ఉద్యమాలను చేశారన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల పోరాటంలో, నిజాం సాగర్ నీటి కోసం జరిగే పోరాటంలో ముందున్నాడని, రైతు కూలీల రాజ్యం పేదల రాజ్యం కావాలని కోరుకున్నాడన్నారు.1996లో అతివాద పీపుల్స్ వార్ అతీ కిరాతకంగా శావులం సాయిలును చంపివేశారని, ఆయన చనిపోయిన ఆయన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఈ దేశ వనరులను ఆశ్రిత పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని,ఆయన పోరాట స్ఫూర్తి తో రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా,నగర నాయకులు శివకుమార్,నాయకులు జన్నారపు రాజేశ్వర్,దేవిక, న్యూడెమోక్రసీ నాయకులు రమేష్,రాజు,శంకర్,సాయిలు, గణేష్, మీరాయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article