రైతాంగ ఉద్యమ యోధుడు శావులం సాయిలు ఆశయాలు సజీవంగానే ఉన్నాయి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ రైతాంగ, కార్మిక ఉద్యమాలను నిర్మించినప్పుడే శావులం సాయిలుకు నిజమైన నివాళులని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో శావులం సాయిలు 29వ వర్ధంతి సందర్భంగా నగరంలో కోట గల్లి నీలం రామచంద్రయ్య భవన్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ శావులం సాయిలు రైతు కూలీలను ఐక్యం చేసి జీతాగల్ల సమస్యలు, రైతు కూలీరెట్ల పెంపుకై అనేక ఉద్యమాలను చేశారన్నారు....