నిజామాబాద్ ఎస్ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్
బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నగరవాసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం అని నిజామాబాద్ ఎస్ ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్ అన్నారు. అందులో భాగంగా మంగళవారం న్యూ హౌసింగ్ బోర్డు ఉప కేంద్రంలో డి 5 సెక్షన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న2.5.00 ఎంవిఏ ఒక 5.0 ఎంవిఎ నుంచి 8.0 ఎంవిఎ పవర్ ట్రాన్సఫార్మర్ చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ నగరంలో దీని ద్వారా, కంటేశ్వర్, ,విద్యుత్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ,మారుతి నగర్, తారకరామా నగర్, హైదరాబాద్ బైపాస్ రోడ్, ఆర్మూర్ రోడ్, చంద్రశేఖర్ కాలనీ, బంగారు మైసమ్మ, కస్తూరి గార్డెన్స్, డాక్టర్స్ కాలనీ, హనుమాన్ టెంపుల్, కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్, ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ఆధారంగా 8.0 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేయబడింది అని తెలిపారు. రూ.80 లక్షల వ్యయంతో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణంలోని సుభాష్ నగర్, ముబారక్ నగర్, గుపన్పల్లి విద్యుత్ ఉప కేంద్రాలలో మరమ్మత్తుల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా కూడా విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో , డి ఈ ఎంఆర్టి పివి రాజేశ్వరరావు ,ఈడిఓపి ఎం శ్రీనివాసరావు , ఎడిఈ టౌన్ టు తోట రాజశేఖర్, స్థానిక ఏ ఈ అసరుద్దీన్, ఏడిఈ ఎస్ పీఎం కె.నట్రాజ్ , పట్టణ ఏ డి ఈ లు చంద్రశేఖర్ ,వీరేశం నగర ఏఈలు డి శ్రీనివాస్, ఆర్ సుమిత, గంగా శేఖర్ డి ఫై స్థానిక సిబ్బంది నిజాముద్దీన్ ఫోర్ మెన్ ,గంగారం, శ్రీనివాస్ లైన్స్పెక్టర్ రాంగోపాల్ లైన్ ఇన్స్పెక్టర్ ,లైన్మెన్ నవీన్ ప్రేమ్ దాస్, సంజీవ్ కమలాకర్ ,చంద్రశేఖ, సుధాకర్ రాకేష్ ,శ్రీధర్ ,రాజు, సిబ్బంది ట్రాన్స్ఫార్మర్స్ మక్సుద్, ఫోర్ మెన్ ఆనంద్ చారి, రవి, కైలాస్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

