జాతీయవాద యువకులను తయారు చేయడమే ధ్యేయం

0 14,594
  • ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం కోసం జాతీయవాద యువకులను తయారు చేయడం జాతీయ  పునర్నిర్మాణం ధ్యేయంగా ఏబీవీపీ పని చేస్తుందని ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం, 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక  అంబేద్కర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నడి రోడ్డుపైన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీగారు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఏబీవీపీ ఆవిర్భవించి 77 వసంతాలు పూర్తి చేసుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వరల్డ్ నెంబర్వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ఎదిగిందన్నారు. దేశంలో అన్ని కళాశాలలో విశ్వవిద్యాలయంలో విస్తరించి పేద గ్రామీణ విద్యార్థుల గొంతుకగా ఏబీవీపీ నిలుస్తుందన్నారు. నేషన్ ఫస్ట్ ఫిలాసఫీలో భాగంగా నరహంత కనెక్సలైట్లు తో పోరాడి దాదాపుగా 40 మంది కార్యకర్తలను పోగొట్టుకున్న ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమరుల ఆశయ సాధన కోసం నేషన్ ఫస్ట్ ఫిలాసవిని విద్యార్థి యువకుల్లో నింపుతూ దేశపునిర్మాణంలో భాగస్వామ్యం చేస్తుందని తెలిపారు. ఈ దేశంలో జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని తెలిపారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇఫ్ నాట్ స్టూడెంట్ ఆర్మీ  అనే మోటోతో నేటి యువతకు  ఆర్మీలో చేరే అవకాశం కోల్పోతే విద్యార్థి సంస్థ ఆర్మీ అయినా ఏబీవీపీలో చేరి దేశ సేవలో నిమగ్నం కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా రక్తం నా తెలంగాణ ,హరిత తెలంగాణ, రణభేరి మరియు తెలంగాణ సాధన కోసం మహాపాదయాత్ర చేపట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఈ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు రావాల్సిన 8500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల  గురుకులాలలో పక్కాభవనాలు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వంజరి బాలకృష్ణ, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, శ్రీకాంత్, ప్రేమ్, సన్నీ, మున్నా, మహేష్, లక్కీ, అలంకార్, రంజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

The aim is to create nationalist youth

Leave A Reply

Your email address will not be published.