30.9 C
Hyderabad
Monday, August 3, 2026

టీజీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మంగళవారం టీ.జీ.వో. సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో టీ.జీ.వో.  సంఘం నిర్వహించే పాత్ర ముఖ్యమైనదని తెలిపారు.  డి.ఏ. పి.ఆర్.సి. పెన్షన్, హెల్త్ కార్డ్స్, ప్రమోషన్స్, బదిలీలు,  వంటి ఉద్యోగుల అనేక  అంశాలపై టీ.జీ.వో. సంఘం పోరాడుతుందని అన్నారు. ఇటీవల కొందరు ఉద్యోగులకు ఇంక్రిమెంట్  విషయంలో తలెత్తిన సమస్యను త్వరలోనే  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  టీ.జీ.వో. సంఘం కార్యదర్శి  సంగం అమృత్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యత వల్లనే  ఉద్యోగుల హక్కులను  సాధించుకోవడానికి  సాధ్యమవుతుందని అన్నారు. అందుకోసం సంఘం  యొక్క సభ్యత్వం అనేది చాలా అవసరం కాబట్టి ఈ టీ.జీ.వో. సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. టి.జి.ఓ. అర్బన్ ప్రెసిడెంట్ డాక్టర్  దండు స్వామి  ఆధ్వర్యంలో జి.జి కళాశాలలో నమోదు కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, కోశాధికారి దేవి సింగ్, చందర్, భరత్ రాజ్, జయ ప్రసాద్, ముత్తెన్న, చంద్ర శేఖర్, రాజేష్, రాహుల్, వేణుగోపాల్,  బాలామణి,ఉమాకిరణ్, అనసూయ, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి,తదితర అధ్యాపకులు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

TGO Membership Registration Program

More articles

Latest article