టీజీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మంగళవారం టీ.జీ.వో. సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో టీ.జీ.వో.  సంఘం నిర్వహించే పాత్ర ముఖ్యమైనదని తెలిపారు.  డి.ఏ. పి.ఆర్.సి. పెన్షన్, హెల్త్ కార్డ్స్, ప్రమోషన్స్, బదిలీలు,  వంటి ఉద్యోగుల అనేక  అంశాలపై టీ.జీ.వో. సంఘం పోరాడుతుందని అన్నారు. ఇటీవల కొందరు ఉద్యోగులకు ఇంక్రిమెంట్  విషయంలో తలెత్తిన సమస్యను త్వరలోనే ...