బోధన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక తనిఖీ కేంద్రాన్ని ఆ శాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇసుకను సులభంగా అందుబాటులో ఉంచేందుకు మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఇసుక రవాణాను సక్రమంగా నిర్వహించడానికి ఈ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి టన్నుకు రూ.200 చొప్పున చెల్లించి మహారాష్ట్ర నుండి తెలంగాణకు వాహనాల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని వివరించారు. ఈ కేంద్రం ద్వారా ఇసుక రవాణాపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండి అక్రమ రవాణాను నివారించడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూర తహసీల్దార్ అనూష, మైనింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

