సాలూరలో అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద టీజీఎండీసీ తనిఖీ కేంద్రం ప్రారంభం

  బోధన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక తనిఖీ కేంద్రాన్ని ఆ శాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇసుకను సులభంగా అందుబాటులో ఉంచేందుకు మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఇసుక రవాణాను సక్రమంగా నిర్వహించడానికి ఈ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి టన్నుకు రూ.200 చొప్పున చెల్లించి...