గాంధారి, బతుకమ్మ :
కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ విషాద ఘటన శనివారం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లద్దాఫ్ మౌలాన బీ పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ పోకల హన్మాండ్లు (45) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ముదేల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు, వృత్తి రీత్యా కౌలు రైతు గా పని చేస్తున్నారు. లద్దఫ్ మౌలానా భీ పొలంలో స్టార్టర్ డబ్బాలో లోపం వచ్చిన నేపథ్యంలో, విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అప్రమత్తత లోపంతో ఓ విద్యుత్ వైరు తగలడంతో తీవ్రమైన షాక్‌కు గురై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. హన్మాండ్లు కు భార్య శకుంతల, ఇద్దరు కుమార్తెలు అంజలి, అఖిల ఉన్నారు. మృతుని భార్య శకుంతల ఫిర్యాదు మేరకు గాంధారి ఎఎస్ఐ నర్సయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు .

