30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పదేండ్ల సంక్షేమం కేసీఆర్ పాలన

Must read

📰 Generate e-Paper Clip

  • 17 నెలల విధ్వంసం రేవంత్ రెడ్డి పాలన
  • వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించండి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : కేసీఆర్ పాలన 10 ఏండ్ల సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసం అని మాజీ మంత్రి ఏమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన మీడియా సమావేశం లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కొరకు అని 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ కేసీఆర్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత 10 ఏండ్ల పాలనలో తెలంగాణను  దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ నిలబెట్టారని కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణ ను విధ్వంసం చేసారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 11వ స్థాయికి జీఎస్డీపీ లో 3 స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయింది అని,ఈ లెక్కలే  తెలంగాణ కు రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసానికి ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. అనేక మాయ మాటలు ,మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి  కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారు అని ఎమ్మెల్యే అన్నారు.ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా  అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు,రైతుబందు లేదు,ప్రతి ఆడబిడ్డకు 2500,పెన్షన్ 2000 నుండి 4 000 కు పెంపు,విద్యా భరోసా కార్డు,నిరుద్యోగ భృతి ,500 బోనస్ ఇలా ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని అన్నారు. తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో మా కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసి 33 మందిపై అక్రమ కేసులు పెట్టారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుండి ప్రజల సంక్షేమం గాలికొదిలి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.భూకబ్జాలు, కాంట్రాక్టుల దగ్గర కమీషన్లు తీసుకొనిదే బిల్లులు మంజూరు చేయడం లేదు ఎమ్మెల్యే విమర్శించారు.  వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి.కేసీఆర్ ని ఆశీర్వదించండని కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మాజీ మేయర్ నీతూ కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, సజీత్ ఠాకూర్, మాజీ జెడ్పిటిసి లు జగన్ గడ్డం సుమన తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article