జీజీ కళాశాలలో ప్రదర్శన కళలపై కార్యశాల
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు సాహిత్యం – ప్రదర్శన కళలు బ్రోచర్ ను శనివారం ప్రిన్సిపల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మార్చి 26న నిర్వహించే ఈఅంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఈసందర్భంగా కార్యశాల సమన్వయ కర్త, తెలుగు విభాగం అధిపతి లెఫ్టినెంట్ డా. ఎం. రామస్వామి మాట్లాడుతూ తృతీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్ కు అనుబంధంగా ఈ కార్యాశాలను రూపొందించామన్నారు. ప్రముఖ వ్యాఖ్యాత వీపీ చందన్ రావు, రంగస్థలం కళాకారుడు శ్రీనివాసరెడ్డి ప్రధాన వక్తలుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రంగరత్నం, ఐ.క్యూ. ఏ.సి. కో-ఆర్డినేటర్ రాజేష్, పీ.ఆర్.వో. దండు స్వామి, పరీక్షల నియంత్రణ అధికారి భారత్ రాజ్, వినయ్ కుమార్, పీడీ బాలమణి, తెలుగు అధ్యాపకులు రాజేశ్వర్, రాధిక, గంగాధర్, అర్చన, సవిత, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
