23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరు గ్యారెంటీ ల హామీ ఏమయ్యాయి

 

. . . ఓటమి భయంతోనే బీజేపీ పై విమర్శలు

 

. . . బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్రప్రభుత్వం మాత్రం విభజన రాజకీయాలకు తెర లేపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యడు రామచందర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు దేశమంతా ఒక్కటే. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా బీజేపీ నేతలపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ర్టానికి ఎన్ని నిధులు వచ్చాయో తమ వద్ద స్పష్టమైన చిట్టా ఉందని రామచందర్ రావు పేర్కొన్నారు. అమృత్ పథకం కింద నిజామాబాద్ అభివృద్ధి, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఇవన్నీ కేంద్రానివే, మరి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టానికి ఏం ఇచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోబట్టే కాంగ్రెస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో పాలన కుంటుపడిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని, వాటి అమలుకు నిధులు లేవు కానీచ కమీషన్లకు మాత్రం నిధులు ఉంటాయా అని ప్రశ్నించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఊసేదని, విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారని, రాష్ర్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్ట పగలే హత్యలు జరుతున్నాయని, ఐఎస్ఐ ఏజెంట్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారంటు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారు 40 మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీసులను అడిగితే ఆ లెక్కలు తెలుస్తాయని అన్నారు. చనిపోయిన వారిపై కనీసం సానుభూతి కూడా చూపని ప్రభుత్వం, మజ్లీస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్మన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Telangana will move forward on the path of development with central funds only.

More articles

Latest article