నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖో ఖో సెలెక్షన్స్ యూనివర్శిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా. జి. బాలకిషన్ తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లా నుండి సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చిన వైస్ ఛాన్సలర్ ప్రొ. టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రో. ఎం యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సెలెక్షన్స్ లో ప్రతిభ గల వారిని సెలక్షన్ చేసి తమిళనాడు సెంట్రల్ యూనిర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటి ఖో ఖో మెన్ ఈ నెల 27-31 తేదీలలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత , ఫిజికల్ డైరెక్టర్స్ డా. బాలమని, అనిల్ కుమార్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

