24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి, జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా ని ఆవిష్కరించారు.

 

Telangana Liberation Day celebrations at BRS party office

 

అనంతరం వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్క్‌ కు చేరుకుని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్, చింతకాయల రాజు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Telangana Liberation Day celebrations at BRS party office

More articles

Latest article