30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి

Must read

📰 Generate e-Paper Clip

  • టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

ఢిల్లీ, బతుకమ్మ : కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిలాంటిదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ లోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తో శుక్రవారం  టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బిసి కుల గణనపై పిపిటి ఇచ్చారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బిసి కుల గణన హామీ తో తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో కుల గణన హామీ ఇవ్వడంతో సమాజంలో బిసిలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిసి కుల గణన పై అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గం కుల గణన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీస్కొని వేగవంతంగా కార్యాచరణ చేపట్టారని తెలిపారు. శాస్త్రీయంగా కుల గణన చేపట్టారని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా క్యాబినెట్ ఉప సంఘం వేశారని తెలిపారు. క్యాబినెట్ లో ఆమోదం, అసెంబ్లీ లో బిల్లు చేసి సమగ్రమైన చర్చ జరిపామని తెలిపారు. ఈ కుల గణన వల్ల రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని, దాంతో ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలో లెక్క తేలిందని తెలిపారు. కుల గణన దేశంలోనే మొదటిసారి తెలంగాణ లో జరగడం అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగడం గొప్పదనమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ లో కుల గణన చేపట్టామని తెలిపారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్లు చేయాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కృషి చేస్తున్నామని తెలిపారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం, దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిదులు, మీడియా ఇంచార్జ్ లు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ నాయకులు జైరాం రమేష్, కొప్పుల రాజు, మధు యాష్కీతదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article