టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో తొలి,మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీలను స్మరించుకొని యేలాగైతే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకునేంతవరకు, అంతఃకరణ శుద్ధితో ఉద్యమించి, ఉద్యోగులందరం నేడు ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేరవేయటలో ప్రముఖ పాత్ర...