హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో బుధవారం భారీ వర్షాలు కురవనున్నాయి.
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు అరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ అధికారులు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
