29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

25న తెలంగాణ కేబినెట్ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  ఈనెల 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.  స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోపు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని హైకోర్టుకు తప్పనిసరిగా చెప్పాల్సి ఉన్నందున అప్పటిలోగా అన్నీ సిద్ధంచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈవిషయమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత రిజర్వేషన్ల విధానంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరపాలని  కేబినెట్‌ గతంలో తీర్మానించింది. ఈనేపథ్యంలో  25 లేదా 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వాలని  అధికారులు  కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

 Telangana Cabinet meeting on 25th

More articles

Latest article