27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హంగర్గా గ్రామాన్ని పరిశీలించిన తహసీల్దార్ విటల్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతంలో నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో వరద నీరు భారీగా చేరింది. ఈ నేపథ్యంలో గురువారం బోధన్ తాసిల్దార్ విట్ఠల్ హంగర్గా గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వరకు వరద నీరు చేరిన దృశ్యాన్ని పరిశీలించినబోధన్ తాసిల్దార్ విట్టల్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article