ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గిరిజన తండాల్లో తీజ్ వేడుకలను గిరిజనులు ఘనంగా జరుపు కున్నారు.బుగ్గ రాజేశ్వరతండా, బాకుర్పల్లి తండా, గుండారం గ్రామాల్లో తీజ్ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో బుట్టలలో పెంచిన గోధుమ నారునుగిరిజన యువతులు తలపై పెట్టుకొని సాంప్రదాయ నృత్యాలతో అలరించి గురువారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి బిజెపి మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి బీజేపీ నాయకులు,గుండారం,బుగ్గ రాజేశ్వర తండాల్లో చంద్రు నాయక్, శంకర్ నాయక్,అజ్మీరా తిరుపతి నాయక్ ల ఆధ్వర్యంలో ఆయా తండాల పెద్ద మనుషులు,తండా వాసులు, గిరిజన సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

