25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డిపేటలో బీజేపీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు,79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన త్రివర్ణ పతాక వైభవాన్ని చాటడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపు మేరకు మన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల గర్వంతో ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతో జాతి సమైక్యతకు ప్రతీకగా ప్రతీ ఒక్కరం మన ఇళ్ళపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం దేశభక్తిని చాటుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పొన్నాల తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, సీనియర్ నాయకులు మద్దుల బుగ్గారెడ్డి, ఉడుగుల యాదగిరి,పారిపల్లి సంజీవరెడ్డి, పిట్ల శ్రీశైలం, బంధరపు లక్ష్మారెడ్డి,ప్రదీప్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ మాలోత్ కిరణ్ నాయక్,పట్టణ అధ్యక్షుడు గంట బాలకృష్ణ,వంగల రాజు, వంగ శ్రీకాంత్,శ్యాగ లక్ష్మణ్, ఆకుల సాగర్,దాసరి పవన్, పరశురాములు,నరసయ్య, భాను, బాల్ రెడ్డి, అరవింద్, రంజిత్, కుమార్,గణేష్,రమేష్, కిష్టయ్య, మహేష్, రాజేష్ గుప్త,దిటి నరసయ్య, చందుపట్ల రామ్ రెడ్డి, లంబ కిషన్, వినయ్,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BJP Har Ghar Tiranga program in Yella Reddypet

More articles

Latest article