29.2 C
Hyderabad

టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రఘురాం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ జాతీయ కౌన్సిల్ సభ్యులు రఘురాం  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో  ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘురాం విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరారు.  యూనివర్సిటీల‌ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, యూనివర్సిటీల అభివృద్ధి కోసం  అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా  అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ఉచితంగా మెస్, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్   సంజయ్, కో కన్వీనర్  చందు  నాయకులు అజయ్, నవీన్, కుషాల్, టోకు, లక్ష్మణ, చతుర్ సింగ్, పీరు పాల్గొన్నారు.

More articles

Latest article