టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి
ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రఘురాం నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ జాతీయ కౌన్సిల్ సభ్యులు రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘురాం విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, యూనివర్సిటీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ...