టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2025 మార్చ్ నెలలో జరుగబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు తమ ఓటును నవంబర్ 6 లోపు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ పిలుపునిచ్చారు. ఏర్గట్ల మండలంలోని గుమ్మర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మేధావి వర్గంగా పేర్కొనబడే ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు మాత్రమే తమ ప్రతినిధులను శాసన మండలికి పంపే అవకాశం ఉందని అన్నారు. ఆ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయుల, ప్రజా సమస్యలను శాసన మండలిలో లేవనేత్తి ప్రశ్నించే గొంతులను శాసన మండలికి పంపించాలని అన్నారు.
