ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ బతుకమ్మ..
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన భారతీయ పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందనినిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అందుకే భవిష్యత్ తరాలకు వాటి యొక్క విలువలను చిన్ననాటి నుండి నేర్పించాలని ఆయన అన్నారు. ఆదివారం నగరంలోని ఎం ఎన్ కన్వెన్షన్ హాల్లో హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, శ్రీ వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా మూడ నాగభూషణం గుప్తా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా పండగను తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా కుటుంబ సమేతంగా సంతోషంగా గడుపుకుంటారని అన్నారు. నేటి పాశ్చాత్య సంస్కృతికి యువత, చిన్నారులు అలవాటు పడి హిందూ ధర్మం పండుగలు, సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, అందుకే వారి వారి తల్లిదండ్రులు చిన్ననాటి నుండితమ పిల్లలకు మన పండుగలు, సాంప్రదాయాలను అలవాటు చేయాలని అప్పుడే పండగల యొక్క ప్రాముఖ్యత వారికి తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా వేదికపై విజయదశమి జంబిని ఒకరినొకరు ఇచ్చుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే కార్యక్రమానికి అతిధిలను నాగభూషణం గుప్తా సన్మానించారు. కార్యక్రమం లో సీనియర్ న్యాయవాది టక్కర్ హన్మంత రెడ్డి, లోక భూపతి రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, ప్రముఖ కవి గంట్యాల ప్రసాద్, న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

