ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో క్షయ వ్యాధి అవగాహన పై టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం,ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ బండలింగంపల్లి ఉప ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టి.బి సూపర్వైసర్ మహిపాల్ మాట్లాడుతూ ఇందులో షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అన్నారు. క్షయ లక్షణాలు ..రెండు వారాలు మించి దగ్గు,జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వున్న వారు తెమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో 145 మంది పైగా టిబి స్క్రీనింగ్ చేశామని 26 మంది అనుమానితుల నుండి తేమడ నమూనాలను సేకరించి ల్యాబ్ కి పంపించమన్నారు. 15 మంది సింటమేటిక్ వాళ్ళని ఎక్స్ రే కి సిరిసిల్ల మెడికల్ కాలేజ్ రేడియాలజీ ల్యాబ్ కి రెఫర్ చేసామని అందులో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు పూర్తి ఉచితంగా పరీక్షలు, మందులు ఇస్తామన్నారు.అలాగే నిక్ష్యయ్ పోషన్ ద్వారా వ్యాధిగ్రస్తుతులకు నెలకి 1000/- రూ. పౌష్టికాహారం కోసం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో డా. సారియా అంజూమ్ , టి. బి. సూపర్వైజర్,జి. మహిపాల్ ఎస్ టి ఎస్, ఎచ్ ఎస్ పద్మ, ఎం ఎల్ హెచ్ పి రేవతి, ఏన్ఎంలు కమల, భారతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
