- 8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టపూర్ గ్రామ శివారులో గల ఫార్మ్ హౌస్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 8మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్స్, రూ.69710 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఏర్గట్ల ఎస్ఎచ్ఓకు అప్పగించారు. ఈ దాడులో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై శివరామ్, సిబ్బంది పాల్గొన్నారు.
