Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 9:19 pm Posted by : ramakrishna

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి

  • 8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

 

ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల పోలీస్ స్టేషన్  పరిధిలోని బట్టపూర్ గ్రామ శివారులో గల  ఫార్మ్ హౌస్ లో నిర్వహిస్తున్న  పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 8మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్స్, రూ.69710 నగదు స్వాధీనం చేసుకున్నారు.  తదుపరి చర్య నిమిత్తం ఏర్గట్ల  ఎస్ఎచ్ఓకు అప్పగించారు. ఈ దాడులో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై శివరామ్, సిబ్బంది పాల్గొన్నారు.