నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మాలపల్లిలో ఆన్‌లైన్ గేమింగ్ ఆడుతున్న అడ్డాపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. వీరి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, రూ.5300 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం 1 పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.